ప్రజాబలం న్యూస్ తూప్రాన్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో మహంకాళి దేవాలయంలో, దేవి గార్డెన్లో శలాక రాజశేఖర శర్మ,స్థానిక బాలాంజనేయ స్వామి దేవాలయం మందిరంలో సోమయాజుల రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దుర్గాభవాని సేవా సమితి అధ్యక్షులు చాడ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతిరోజు అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి పూజా కార్యక్రమంలో మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి,మన్నె శ్రీనివాస్,మామిండ్ల అనిల్, జంగం రాములు,శ్రీకాంత్,మధు, బజారు చక్రవర్తి,ప్రభాకర్ రెడ్డి,అంజా గౌడ్,నాగరాజ్, కిష్టాపురం కృష్ణారెడ్డి,మల్లారెడ్డి,
,శ్రీనివాస్ రెడ్డి,సాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాముని గారి అశోక్ గౌడ్ ,, స్వర్గం వెంకట్ నారాయణ అమ్మవారి భక్తులు భారీగా పాల్గొన్నారు.