మహిళలు, ప్రత్యేక స్థానం కల్పించేలా
వేడుకలు నిర్వహణ.
డి ఆర్ డి ఓ, మెప్మా ఆధ్వర్యంలో సాంప్రదాయ వంటకాల ప్రదర్శన
యువజన క్రీడల నిర్వహణ శాఖ
ఆధ్వర్యంలో
రేపు ఉదయం
07 గంటలకు 02కె రన్
తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా వేడుకలు
500 మంది మహిళలు హాజరయ్యే అవకాశం
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాబలం దినపత్రిక మెదక్ జిల్లా ప్రతినిధి
08.102024:
బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని, ఈ సంబరాలను కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రేపు కలెక్టరేట్ కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణలో సందర్భంగా, మరియు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశానికి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ ఆర్ డి ఓ రమాదేవి, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, మెప్మా పిడి ఇందిరా, సంబంధిత ఇతర శాఖల అధికారులతో లతో కలసి జిల్లా కలెక్టర్ సమీక్షించి సమర్ధ నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా బతుకమ్మ జరుపుకుంటామని వారి సౌకర్యార్థం అవసరమగు ఏర్పాట్లు చేయాలన్నారు. బతుకమ్మ జరుపుకునే అన్ని ప్రాంతాల వద్ద లైటింగ్, మంచినీటి సౌకర్యం. సౌండ్ సిస్టం బతకమ్మ జరిగే , అన్ని ప్రాంతాల్లో తదితర మౌలిక సదుపాయాలతో పాటు చెరువులలో గుర్రెపు డెక్క తొలగించాలని, ప్రతి మండలంలో బతుకమ్మ సంబరాలను విజయవంతంగా నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. డిఆర్డిఓ మెప్మా ఆధ్వర్యంలో
కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణ ఆవరణలో సాంప్రదాయ వంటకాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు యువజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో మెదక్ స్టేడియం నుండి రాందాస్ చౌరస్తా వరకు2కేర్ నిర్వహణకు
మహిళలు బతుకమ్మ ఆడిన తరువాత చెరువుల్లో నిమజ్జనం చేస్తారని నిమజ్జన ఘాట్లు వద్ద విద్యుత్ ఏర్పాట్లు, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
మహిళలు నీళ్లలోకి దిగకుండా భద్రతపై పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అన్నారు ట్రాఫిక్ నియంత్రణ, మహిళ పురుషుల పోలీసులతో పటిష్ట పోలీసు బందోబస్తు, సిసి కెమెరాల ఏర్పాటు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, నగరం , వైద్య ఆరోగ్యశాఖ ద్వారా వైద్య అంబులెన్స్లు ,, ఆయా చెరువుల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. తెలంగాణ సంప్రదాయం, సాంస్కృతి ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమలు ఏర్పాటు చేయాలన్నారు.వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుటకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు భారీ వాహనాలు ప్రధాన రహదారిపై రాకుండా మళ్లించడం పోలీస్ యంత్రాంగం తరపున
పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు.