ధాన్యాన్ని కొనుగోళ్లు పకడ్బందిగా నిర్వహించాలి.. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

 

ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా నియోజకవర్గం
08.10.2024:

వానాకాలం 2024–25 సీజన్‌ వరి ధాన్యం సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లలో ఎ గాలాంటి అవకతవకలకు తావులేకుండా సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ·జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు · ఆదేశించారు.
మంగళవారం, జిల్లాలోని సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలోని మెయిన్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో వానాకాలం (ఖరీఫ్‌) – 2024–25 సీజన్‌ వరి ధాన్యం (సన్న రకం, దొడ్డు రకం) కొనుగోలుపై ఏఈఓలు, డీపీఎంలు, ఏపీఎంలు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, కమ్యూనిటీ కో–ఆర్డినేటర్‌ లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఫ్యాక్స్, ఐకెపి, మార్కెటింగ్, శాఖల ద్వారా 463 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఐకెపి ద్వారా (160 ) కొనుగోలు కేంద్రాలు, ఫ్యాక్స్‌ ద్వారా (284) , డిఎం సివిల్‌ సప్లై (07) FPO–(12) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు
ఇందులో సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు 93 ఏర్పాటు చేయగా, దొడ్డు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 370 ఏర్పాటు చేశామన్నారు
రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా సన్న రకం ధాన్యంపై రూ. 500 బోనస్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ బోనస్‌ 48 గంటల్లో (రెండు రోజుల్లో) రైతుల అకౌంట్‌ లలోకి జమ అవుతుందన్నారు.
ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డు రకానికి వేర్వేరుగా రికార్డులను సరైన విధంగా నిర్వహించాలని, మూమెంట్‌ ప్లాన్‌ రిజిస్టర్‌ లను సన్న, దొడ్డు రకానికి వేరుగా నిర్వహించాలన్నారు
ఈ రిజిస్టర్‌ లలో రైతు పేరు, ఫోన్‌ నంబర్, సమయం, స్థలం, రైతు సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని, ప్రతి కేంద్రానికి దొడ్డు రకానికి ఒN(ఇ – కోర్సు) 1, 2, 3, 4…అని, సన్న రకానికి ఒN(S – సన్నాలు) 1, 2, 3, 4…. అని ఇలా కోడ్‌ ను కేటాయించామన్నారు
ఈ కోడ్‌ ను ప్రతి ధాన్యం బస్తాలపై ఉండాలని, దీనిని ప్రతి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కచ్చితంగా పాటించాలని, దొడ్డు రకానికి పచ్చ దారం, సన్న రకానికి ఎర్ర దారం ఉండాలని, ఏఈఓలు ప్రతి కొనుగోలు కేంద్రాలను సందర్శించాలన్నారు
ఈ రెండు రకాల ధాన్యం తరలింపుకు వేరు వేరుగా రవాణా సౌకర్యం కల్పించాలని, ధాన్యం తేమ శాతం 17గా ఉండాలని, వానల పట్ల అప్రమత్తంగా ఉంటూ రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలన్నారు
సన్న బియ్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ఓపీఎంఎస్‌ లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ వానాకాలం పంట కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కొనుగోళ్లపై ప్రత్యేక దష్టి సారించాలని, ఏ కేంద్రంలో అయినా ఈ సన్నాలకు రూ. 500 బోనస్‌ పట్ల అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, డయల్‌ గ్రెయిన్‌ క్యాలిబర్‌ లు, చెక్‌ పోస్టులు, టోకెన్‌ ల జారీ, వేయింగ్‌ మెషీన్‌ లు, ప్యాడీ క్లీనర్‌ లు, తదితరాల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో సివిల్‌ సప్లై అధికారులు ,,డి ఎం సివిల్‌ సప్లై హరికష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేష్‌ రెడ్డి, లీగల్‌ మెట్రాలజీ అధికారి సుధాకర్, డిసిఒ కరుణ, మార్కెటింగ్, రవాణా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
సీసీలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking