డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్
ప్రజాబలం దినపత్రిక- మెదక్ జిల్లా నియోజకవర్గం
09-09-2024:
మెదక్ జిల్లా మెదక్ పట్టణంలోని పిట్లంబేస్, నవాబ్ పేట్ కోలిగడ్డ ఎల్ఐసి ఆఫీస్ ఏరియా, జెయన్ రోడ్, రాందాస్ చౌరస్తా మొదలైన ఏరిలాలో జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ స్వయంగా వినాయక నవరాత్రుల బందోబస్తును పరిశీలించి వివిధ మండపాల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచనలు చేయడమైనది ఈ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… నవరాత్రుల బందోబస్తు అత్యంత కీలకమైనదని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పై అధికారులకు తెలియజేయాలని ప్రజలతో వినాయక మండపాల కమిటీ సభ్యులతో మమేకమై విధులు నిర్వహించాలని తెలియజేసినారు.