ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా మెడి 9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ లోగో ఆవిష్కరణ
హైదరాబాద్ : ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడి 9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ లోగోను ఆవిష్కరించింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో మెడి 9 హెల్త్ సైన్సెస్ క్లినికల్ డైరక్టర్ డాక్టర్ వెంకట రామిరెడ్డి, వైద్యులు డాక్టర్ రమణ రాజు, డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ విజయ లక్ష్మి మెడి 9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎన్నో వేల సంవత్సరాల నుండి వినిపిస్తున్న సూక్తి , ఎంత డబ్బు , హోదా ,సంపద ఉన్నా మంచి ఆరోగ్యం లేక పోతే ఏమి లేనట్లే. ఈ సూక్తి ని ప్రేరణ గా తీసుకుని ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ ను, సమీకృతీకరించి మెడి 9 హెల్త్ సైన్సెస్ సంస్థ హోమియోపతి, ఆయుర్వేద. పేషెంట్ యొక్క సమగ్ర సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మంచి అవకాశాలను అందిస్తుంది. ఈ వ్యవస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు మానవ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ఐ సి ఎం ఆర్ భాగస్వామిగా ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. జాతీయంగా ముఖ్యమైన వ్యాధుల చికిత్సలో ఇటువంటి ఏకీకరణ యొక్క ప్రయోజనాలను శాస్త్రీయంగా ధృవీకరించాలని కోరింది. ఈ సంచలనాత్మక చొరవ మిశ్రమ చికిత్సల ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో కీలకమైన దశను సూచిస్తుంది. అందువల్ల ఆరోగ్య సంరక్షణకు సమగ్ర, సాక్ష్యం ఆధారిత విధానం యొక్క తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుందని తెలిపారు.
సమగ్ర ఔషదాల ఏకీకృత వ్యవస్థ ఏమిటి? : సమగ్ర ఔషదాల ఏకీకృత వ్యవస్థ, పేషెంట్ కి అత్యంత ప్రభావవంతమైన చికిత్సను అందించడానికి వివిధ ఆరోగ్య సంరక్షణ పద్ధతులను మిళితం చేస్తుంది. ఈ విధానం లో ఆయుర్వేదం, హోమియోపతి , నేచురోపతి ఆక్యుపంక్చర్, అక్యూప్రెషర్ ,సిద్ద యోగా ,హెర్బల్, కిరో ప్రాక్టిక్ వంటి ప్రత్యామ్నాయ లేదా సాంప్రదాయ పద్ధతులతో “పాశ్చాత్య” వైద్యాన్ని మిళితం చేస్తుంది. ఏకీకృత వ్యవస్థ యొక్క లక్ష్యం కేవలం ఒకే వ్యాధి, లక్షణంపై దృష్టి సారించడం కంటే మొత్తం వ్యక్తిని – మనస్సు, శరీరం మరియు ఆత్మకు చికిత్స చేయడం. ఇది మరింత వ్యక్తిగతీకరించిన, సమగ్ర సంరక్షణకు దారి తీస్తుంది. ఇంతే కాకుండా ఈ సమీకృత వ్యవస్థ అనారోగ్యాలకు మాత్రమే చికిత్స చేయడంతో పాటు నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్ల గురించి నొక్కి చెబుతుంది. ఒక సమగ్ర విధానంలో విభిన్న వైద్య వ్యవస్థలను చేర్చడం వలన పేషెంట్స్ వారి ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా , ఉత్తమంగా పనిచేసే చికిత్సలను ఎంచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ ఆధునిక యుగం లో వైద్యులు , టెక్నాలజీ , డయాగ్నోసిస్ , కార్పొరేట్ హాస్పిటల్స్ , మెడికల్ కాలేజ్ లు , పెరిగాయి , అయినా దానికి రెట్టింపు వ్యాధులతో, కొత్త కొత్త రకకాల పేర్లతో , చిన్న పిల్లలనుండి పెద్దల వరకు ఇబ్బంది పెడుతున్నాయి , 50 సంవత్సరాల వారికి వచ్చే డయాబెటిస్ , కీళ్ల వ్యాధులు, థైరాయిడ్ , గుండె , లివర్ సంబంధిత వ్యాధులు వంటివి , ఇప్పుడు 20 -30 సం రా లకే వచ్చి ఎంతో బాధిస్తున్నాయి . చాలా ఆరోగ్య సమస్యలు , మాటి మాటికీ తిరగబడి , శారీరకంగా, సామాజికంగా , మానసికంగా , ఆర్ధికంగా క్రుంగదీస్తాయి , అటువంటి వాటిని నిశితంగా పరిశీలించి సమగ్ర వైద్యం అందించాలి. ఆయుర్వేద, హోమియోపతి , నేచురోపతి , సిద్ధ, యోగ ,అక్యూపంక్చర్ , అక్యూప్రెషర్ , హెర్బల్ మరియు కైరోప్రాక్టీక్ వంటి వైద్య విదానములు వేల సం రాల నుండి ఎంతో మందికి స్వస్థత చేకూర్చాయి . అటువంటి వివిధ శాఖలకు సంబందించిన వైద్య బృందం మెడి 9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టం ను ఒకే ప్రాంగణం లో స్థాపించి అన్ని రకాల చికిత్సలకు వైద్యం చేస్తున్నారు. 30 సంవత్సరాలకు పైగా అనుభవం , నిపుణత, పరిశీలనా కలిగిన డాక్టర్స్ బృందం వ్యాధి కారకాలను తెలుసుకుని వ్యాధి మూలాలకు చికిత్స చేస్తారు. తద్వారా మాటి మాటికీ తిరగబడే దీర్ఘ కాలిక మొండి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఈ ఇంటిగ్రేటివ్ చికిత్స లో మెడిసిన్ , ఎక్సర్ సైజ్ , డైట్ , ఇమ్మ్యూనిటి బూస్టర్స్ ద్వారా చికిత్స ను అందిస్తారు. అందుకే మెడి 9 అంటే మెడిసిన్ , ఎక్సర్ సైజ్ , డైట్ ఇమ్మ్యూనిటి బూస్టర్. దశాబ్దాల పరిశీలన ,పరిశోధన అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ నే కాకుండా ఎన్నో సంస్థలు ఈ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ చాలా శుభ పరిణామం అని తేల్చాయి. హోమియోపతి కి ఆయుర్వేదం తో పాటు , అక్యూపంక్చర్ , అక్యూప్రెషర్ , నేచురోపతి , పంచకర్మ , ఫీజియోథెరపీ వంటి వైద్య విధానములు ద్వారా పేషెంట్ త్వరగా కోలుకోవటం జరుగుతుంది . దీర్ఘ కాలిక మొండి వ్యాధులు , మాటి మాటికీ తిరగబడకుండా , వ్యాధి మూలాలకు చికిత్స చేయటమే మెడి 9 యొక్క ప్రధాన ద్యేయం . ఇక్కడ సేవాభావం , కేర్ , సర్వీస్ ప్రధాన అంశాలుగా మెడిసిన్ , ఎక్సర్ సైజ్ , డైట్ , కౌన్సిలింగ్ ఇస్తూ , మీ దీర్ఘ కాలిక , మొండి వ్యాధుల వ్యాధి మూలాలకు చికిత్స చేస్తారు.ఇక్కడి వైద్యులు, మీ సమస్యని పరీక్షించి , వ్యాధి కారకాలను తెలుసుకుని , వ్యాధి మూలాలకు చికిత్స చేస్తారు. తద్వారా మీ ఆ వ్యాధి మరల మరలా తిరగబెట్టకుండా ఉంటుంది. అతి తక్కువ ఖర్చు తో , నొప్పి లేకుండా వ్యాధి మూలాలకు చికిత్స చేయటమే మెడి 9 ప్రత్యేకత . చికిత్స చేయటమే కాకుండా దానికి సంబందించిన వ్యాయామాలు, ఆహార నియమాలు అన్ని సవివరంగా , వివరించి మీకు మనోస్వాంతన చేకూరుస్తారు . మీరు మర్చిపోయినా, మీ ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకుని , ఫోన్ లో మీ ఆరోగ్య విషయాలను , ఆహార నియమాలను గుర్తుచేస్తూ మీరు పేషెంట్ కాదు, మా ఫామిలీ మెంబర్ అనే ఫీలింగ్ ని మీకు కలుగ చేస్తారు. మెడి 9 లో చికిత్స అంటే మీ ఇంట్లోనే చికిత్సలాగా భావించవచ్చు.