పదేళ్లుగా మెదక్ పై చిన్నచూపు
అభివృద్ధిలో సిద్దిపేట నేతలదే పెత్తనం
మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ హఫీజ్ మొల్సాబ్
మెదక్
మెడికల్ కాలేజీ అంశం ఎన్నికల స్టంట్ అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ హఫీజ్ ముల్సాబ్ అభివర్ణించారు. గురువారం ఆయన మెదక్ విలేఖర్లతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీ అంశంలో గత పదేళ్లుగా తాము పోరాటం చేయడంతో ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యే ఎన్నికల వేళ ఇలాంటి ప్రకటన చేశారని ఆరోపించారు. బీ ఆర్ ఎస్ హయాంలో మెదక్ అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు. ఎమ్మెల్యే కి ఈ ప్రాంతం అభివృద్ధి పై ఏ మాత్రం చిత్తశుద్ది లేదన్నారు.అన్నీ విషయాల్లో సిద్దిపేట నేతలదే పెత్తనం కొనసాగుతుందని మండిపడ్డారు. సిద్దిపేట లో మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయన్నారు. మెదక్ లో ఇంకా మెడికల్ కాలేజీకి స్థలం కూడా కేటాయించ లేదని ఎద్దేవా చేశారు.