డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కి ఘన నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ

 

ఖమ్మం ప్రతినిధి జులై 06 (ప్రజాబలం) ఖమ్మం స్వతంత్ర్య సమరయోధుడిగా సంఘ సంస్కర్తగా సమతావాదిగా తన పాలనా దక్షతతో దేశానికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు.

గురువారం ఖమ్మం నగరం తెలంగాణ తల్లి సర్కిల్ నందు గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి పువ్వాడ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, పగడాల నాగరాజు, కొల్లు పద్మ, కంచర్ల దయాకర్, అరెంపుల వీరభద్రం, భాస్కర్, ఏడెల్లి బిక్షం, షకీన, నారమళ్ల వెంకన్న, షంశుద్దిన్, తన్నీరు శోబారాణి, యేచ్చు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking