తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి…
ఏపీ బీజేపీ చీఫ్‌గా పురంధేశ్వరి
న్యూఢల్లీి, జూలై4 తెలుగురాష్ట్రాల్లో సంస్థాగత మార్పులపై దృష్టిపెట్టిన బీజేపీ రెండు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. అలాగే ఏపీ బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజు ప్లేస్‌లో పురంధేశ్వరి బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటెల రాజేందర్‌ను నియమించింది బీజేపీ అధిష్టానం. కాగా ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక 2020 జులై 27న ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన సోము పదవీ కాలం కూడా ముగియ డంతో పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించారు. కాగా మొదట బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్కు ఏపీ పగ్గాలు అప్పగించవచ్చని ప్రచారం సాగింది. అయితే చివరకు పురంధేశ్వరినే ఖాయం చేసింది బీజేపీ అధిష్టానం. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కించు కున్నారు.కాగా సుమారు మూడేళ్ల పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు తీరుపై పలు ఫిర్యాదులున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా వెళ్లడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాన్ కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీతో పొత్తు ఉన్నా రాష్ట్ర నాయకత్వం సహకరించడం లేదంటూ కమలం పార్టీపై విమర్శలు గుప్పిం చారు. అలాగే కన్నాల క్ష్మీనారాయణ వంటి సీనియర్ నేతలు పార్టీకి దూరమయ్యారు. ఈక్రమంలోనే పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురా లిగా ఆ పార్టీ అధిష్ఠానం దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించింది. ఇప్పటి వరకూ ఈమె బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు. అంతేకాక, ఒడిశాకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్నారు. సోము వీర్రాజును రాజీనామా చేయించిన అనంతరం అధ్యక్ష పదవి కోసం సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించాయి. కానీ అధిష్ఠానం పురంధేశ్వరి వైపే మొగ్గు చూపింది.
తెలంగాణకు కిషన్ రెడ్డి…
కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన నేత. 1977లో జనతా పార్టీలో యువనాయకుడిగా ప్రస్థానంప్రారంభించారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నంచి ఆ పార్టీలో పని చేస్తు న్నారు. 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టారు. 1985లో ఉమ్మడి రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు అయ్యారు. యువమోర్చాలో అనేక పదవులు నిర్వహించారు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను నిర్వహించారు. 2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కిషన్ రెడ్డి 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టారు. 2009 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27000 పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికలలో మూడో సారిగెలిచారు. 2014 లో మరల తెలంగాణ జనతా పార్టీ అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టారు. కిషన్ రెడ్డి 2018 లో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆరెస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి పాలైనా 2019 లో జరిగిన పార్లమెంట్ ఎలెక్షన్లలో సికింద్రాబాద్ నుండి గెలిచి క్యాబినెట్ మంత్రి అయ్యారు. తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిణామాలతో బండి సంజయ్ ను మార్చాలని హైకమాండ్ అనుకున్నప్పటికీ ఈటల రాజేందర్ సహా పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈటల రాజేందర్ ఇటీవలే పార్టీలో చేరారు. ఆయనకు పదవి ఇస్తే..సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్న వారు అసంతృప్తికి గురవుతారన్న ఉద్దేశంతో .. సీనియర్ నేత అయిన కిషన్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లుగా భావిస్తున్నారు. అందర్నీ కలుపుకుని వెళ్లడంలో కిషన్ రెడ్డి చొరవ చూపిస్తారని భావిస్తున్నారు. అయితే బీజేపీలో జోడు పదవుల సంప్రదాయం లేదు. కేంద్ర మంత్రిగా ఉంటే.. రాష్ట్ర బీజేపీ పదవికి న్యాయం చేయలేరన్న ఉద్దేశంతో పార్టీ పదవి లేదా కేంద్రమంత్రి పదవి ఏదో ఒకటి కేటాయిస్తూ ఉంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా కొనసాగు తారాలేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. తొలగింపునకు గురైన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఈటల రాజేందర్‌కు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవిని ప్రకటించారు. ఈ నియామకాలతో తెలంగాణ బీజేపీ మొత్తం ఏకతాటిపైకి వస్తుందని హైకమాండ్ ఆశిస్తోంది.
బండి సంజయ్ రాజీనామా
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందని కొద్ది రోజుల క్రితమే ఖరారైన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే తాజాగా బండి సంజయ్ పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం బండి సంజయ్ ఢల్లీిలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు. ఆయనతో పాటు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఉన్నారు. కేబినెట్ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల వేళ బాపూరావును పిలిచినట్లుగా తెలుస్తోంది. మరోవైపు, కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, షెకావత్‌తో జేపీ నడ్డా భేటీ అయ్యారు. కేబినెట్ లో మార్పులు ఉంటాయనే వార్తల వేళ ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కొందరు కేంద్ర మంత్రులను రాష్ట్రాలకు అధ్యక్షులుగా పంపుతారని సమాచారం. వీరి భేటీ తర్వాతే కొన్ని రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటిం చారు.తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించారు.