పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయలి: అధికారులతో సమీక్ష సమావేశంలో :వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జూలై 4:
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రైనేజ్, బస్టాండ్ కలెక్టరేట్ అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలు పనులను వెంటనే పూర్తి చేయాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ననపనేని నరేందర్ అధికారులను ఆదేశించారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పురిగతిపై అన్ని శాఖల అధికారులతో హన్మకొండలోని కుడా కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన
ఉదయం 11గంటల నుండి 6గంటల పాటు
ఆయా శాఖల అధికారులను పనుల పురోగతి గురించి ఎమ్మెల్యే నన్నపునేని ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్నాయని మరి కొన్నింటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.
నూతనంగా నిర్మించనున్న బస్ స్టేషన్ పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని తాత్కాలిక బస్టాండ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని అన్నారు.నూతనంగా నిర్మించనున్న కలెక్టరేట్ సమీపంలో డ్రైనేజ్ ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.ఉర్సు గుట్ట నుండి భద్రకాళి బండ్ వరకు వరద కాలువలు త్వరగా పూర్తి చేయాలనీ
బిసి కార్పొరేషన్ లోన్ కోసం అప్లై చేసుకున్న వారికి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి,దృవీకరించాలనీ అధికారులకు సూచించారు.గృహాలక్ష్మి పథకం ఆన్లైన్ ద్వారా స్వీకరించి అప్లై చేసుకోవడానికీ ఏమేమీ అవసరం అనేది ప్రజలకు వివరించాలనీ
గృహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన పేదలకు అప్లై చేయడానికి ప్రాసెస్ తెలియని వారికి ఎవరైనా ఉంటే కార్పొరేటర్లు ముందు ఉండి అప్లై చేయించాలనీ పెన్షన్స్ 57-65సంవత్సరాల వయసువారు అప్లై చేసుకోవాల్సిన సైట్ లో 65సంవత్సరాలలో చేసుకోవడం వల్ల నియోజకవర్గంలో 5వేల పెన్షన్స్ ఆగిపోయాయినీ అన్నారు.కమిషనర్ కలెక్టర్ నేతృత్వంలో ఈ నివేదిక తీసుకొని పరిష్కారం చూడాలనీ పెన్షన్స్ లో చిన్న చిన్న కారణాలతో రావాల్సిన పెన్షన్ ఆగిపోయాయి వాటిని వెంటనే సరిదిద్ది అర్హత కలిగిన పెన్షన్ దారులు కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన పెన్షన్స్ పూర్తి నివేదిక అందించాలని
అప్రూవల్ అయిన పెన్షన్స్ సమస్యను వెంటనే పరిష్కరించాలనీ అన్నారు.రోడ్డు వెడల్పు,జంక్షన్స్ పనులను త్వరగతిన పూర్తి చేయాలనీ డివిజన్ల లో పలు కాలనీలలో వాటర్ సప్లై వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నార వెంటనే అధికారులు పరిశీలించి పరిష్కార మార్గం చూడాలనీ అన్నారు.
24 డివిజన్లలో వాటర్ సప్ప్లై,విద్యుత్,శానిటేషన్ సమస్యను త్వరిగతిన పూర్తి చేయాలనీ
కార్పొరేటర్లు,అధికారులు సమన్వయంతో పని చేస్తూ సమస్యల పరిష్కారించాలనీ.శంకుస్థాపన జరిగినఅభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి
రోడ్ల నిర్మాణం జరుగుతున్న చోట్లలో పైప్ లైన్ పనులను కొందరు అధికారులు విస్మరిస్తున్నారు విధుల్లో అలసత్వం వహించిన అధికారులపై చర్యల తీసుకుంటామని హెచ్చరించారు.
డివిజన్లలో విద్యుత్తుకు సంబంధించిన స్తంభాలు,వైర్లు ఇతర అంశాలను అధికారులు వెంటనే ఆయా ప్రాంతాల్లో పరిశీలించి వెంటనే పూర్తి చేయాలనీ నియోజకవర్గంలోని అధికారులకు వచ్చిన ఏ పిర్యాదునైన వెంటనే స్వీకరించి సమస్య పరిష్కారం చేయాలనీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు కార్పొరేటర్లు అందరితో కలిసి సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
విధుల్లో అలసత్వం వహిస్తున్న పలువురు అధికారులపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయనతో పాటు మేయర్ గుండు సుధారాణి,కుడా చేర్మెన్ సుందర్ రాజు యాదవ్,వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా,డిప్యూటీ మేయర్ రిజ్వానా షమిమ్ మసూద్,నియోజకవర్గ కార్పొరేటర్లు,ఆర్ అండ్ బి,రెవెన్యూ,విద్యుత్ శాఖ,జిడబ్లుఎంసి,బిసి వెళ్ఫెర్,డిఎండబ్ల్యూఎంఓ అధికారులతో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking