గోవిందరాజ స్వామి దేవస్థానం పాలకమండలి ప్రమాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జులై 4:
చరిత్రకు నిలయమైన వరంగల్ నగర నడి మధ్యన గోవిందాద్రి కొండపై స్వయంభుగా వెలసిన శ్రీదేవి భూదేవి నీలాదేవి సతీసమేతుండైన శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం యందు పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం సాయంత్రము 5 గంటలకు నిర్వహించుటకు ఏర్పాట్లు చేయటం జరిగిందని పాలకవర్గం మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ మహోత్సవానికి
ముఖ్య అతిథులుగా వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా , స్థానిక 27 వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ , బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు చింతాకుల సునీల్, దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ శ టి శ్రీకాంత్ రావు, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, శ్రీ గోవిందరాజ స్వామి, దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వై రత్నాకర్ రెడ్డి, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ జి సంజీవరెడ్డి, ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నట్లు పేర్కొన్నారు ఈ మహోత్సవంలో
శ్రీ గోవిందరాజ స్వామి పాలకమండలి చైర్మన్ సోమ రాతి సత్యనారాయణ, పాలకమండలి సభ్యులు చకిలం ఉపేందర్, అడ్వకేట్ బిర్జా గోపాల్, లహోటి చింతాకుల రాజ కృష్ణ, కుమారి పట్టాభి రాజరాజేశ్వరి, శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు వరయోగుల శ్రీనివాస స్వామి . ఎక్స్ అఫీషియల్ సభ్యులు
ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందని కావున వరంగల్ నగర ప్రజలు మరియు భక్తులు పై కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking