పోడు భూమి రైతులకు పట్టాలు అందజేసిన జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఖమ్మం ప్రతినిధి జూలై 04 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని శ్రీలక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలిసి సత్తుపల్లి మండలంలోని 11 గ్రామాల 1196 మంది పోడు రైతులకు సంబంధించి 1649 ఎకరాల పట్టా పాస్ పుస్తకాల పంపిణీ కలెక్టర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అర్హులైన 6589 మంది గిరిజనులకు 13139.05 ఎకరాల పోడు భూమికి సంబంధించి పట్టాల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. గతంలో 6 వేల పై చిలుకు పోడు పాస్ బుక్ లుంటే, ఈ అర్హులై ఉండి, ఎవరైతే భూమి దున్నుతున్నారో వారికి మంజూరు చేశామన్నారు. భూమి కీలకమైన ఆస్తి అని ఆయన అన్నారు. జల్ జంగల్ జమీన్ అని కొమురం భీం అన్నారో, అడవులను రక్షించుకుంటూ, వాటి ద్వారా బ్రతుకుదేరువు పొందాలన్నారు. ప్రభుత్వం ఎన్నో చట్టాలు తెచ్చినప్పటికి, గిరిజనులకు అవగాహన లేక వాటి లబ్ది పొందలేదన్నారు. పోడు భూముల గ్రామాలు గుర్తించి, సర్పంచ్, పీసా, ఎఫ్ఆర్వో ల ఆధ్వర్యంలో వారి వద్దనే గ్రామసభలు చేపట్టి, 100 రోజుల పాటు సెలవులు లేకుండా కష్టపడి ప్రతి పొలాన్ని క్షేత్ర స్థాయిలో సందర్శించి, 100 శాతం అందరికి న్యాయం చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పట్టా హక్కు మాత్రమే కాదని, రైతుబంధు, రైతుభీమా, గిరివికాసం అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారని ఆయన తెలిపారు. ఇట్టి భూముల్లో ప్రభుత్వ సాయంతో ఆయిల్ పామ్ తోటలు పెట్టవచ్చని ఆయన అన్నారు. పాస్ పుస్తకాల్లో ఆయా రైతుల భూమి ఫోటో తీసి పెట్టినట్లు, ఎలాంటి భూ గొడవల ఆస్కారం ఉండదని ఆయన తెలిపారు. మిగిలిన అటవీ భూములను సంరక్షణకు అటవీ అధికారులకు సహకరించాలని, పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని, చెట్లు, అడవిని దైవంగా భావించే ఆదివాసీలు పచ్చదనాన్ని కాపాడాలని కలెక్టర్ అన్నారు.

కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ పోడు భూములు దున్నుకొని జీవనం సాగిస్తున్న గిరిజన బిడ్డలకు హక్కు కల్పించాలని, ముఖ్యమంత్రి శాశ్వత పరిష్కారం చూపారని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే భావితరాలకు అన్యాయం చేసినవారం అవుతామన్నారు. అటవీ భూములను కాపాడడానికి అందరూ కృషి చేయాలన్నారు. అడవి నరకివేతకు సహకరించవద్దని ఆయన తెలిపారు. పట్టా కలిగిన సాధారణ రైతులకు కలిగే లబ్ది పోడు రైతులు పొందుతారన్నారు. ప్రభుత్వం 3900 కు పైగా తండాలు, గూడెం లను గ్రామ పంచాయతీలుగా మార్చిందన్నారు. పట్టాదారునికి ధరణి లో ఎంత రక్షణ ఉంటుందో పోడు వారికి అంతే ఉంటుందన్నారు. రైతుబంధు, రైతుభీమా, గిరివికాసం, సీతారామ జలాలు, బ్యాంక్ రుణాలు అన్ని రకాల లబ్ది వుంటుందన్నారు. ప్రతి గిరిజన గూడెం కు కరంట్ ఇచ్చామన్నారు. పట్టాలిచ్చి, హక్కులు కల్పించాక, పోడు కేసులకు అర్థం లేదని, సీఎం అన్ని పోడు కేసులను ఎత్తివేశారన్నారు. బంజారా భవన్, ఆదివాసి భవన్ నిర్మించినట్లు, సంత్ సేవాలాల్, కొమురం భీం జయంతులు అధికారికంగా జరుపుతున్నట్లు ఆయన అన్నారు. గిరిజన రైతులకు 8305 కోట్లు రైతుబంధు క్రింద వారి ఖాతాల్లో జమచేసినట్లు ఆయన అన్నారు. యాతాలకుంట గిరిజనులు సర్వే కు సహకరించాలని, అధికారులు అవగాహన కల్పించాలని, ఈ అవకాశం మళ్ళీ రాదని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐటిడిఎ భద్రాచలం పీవో గౌతమ్ పోట్రూ, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఉమామహేశ్వరరావు, కల్లూరు ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ, ఎఫ్డివో మంజుల, సత్తుపల్లి మునిసిపల్ చైర్మన్ మహేష్, ఎంపిపి, జెడ్పిటిసిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking