వైద్య అధికారులు విద్యార్థుల ఆరోగ్య ప్రొఫైల్‌లను తయారు చేయాలి

ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
ఆదిలాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:జిల్లాలోని కేజీబీవీ, మోడల్‌,అన్ని వెల్ఫేర్‌ , గురుకుల స్కూల్స్‌, హాస్టల్స్‌ విద్యార్ధుల హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేయాలనీ మెడికల్‌ ఆఫీసర్‌ లను జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరం లో మెడికల్‌ ఆఫీసర్‌ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మెడికల్‌ ఆఫీసర్‌ లతో కేజీబీవీ, మోడల్‌, వెల్ఫేర్‌ హాస్టల్స్‌, స్కూల్స్‌ విద్యార్ధులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ తయారీ, వారానికి ఒకసారి విద్యార్ధులకు అందిస్తున్న ఐరన్‌ ఫోలిక్‌ మాత్రలు, వంద రోజుల టీబీ క్యాంప్‌ లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు ఆన్ని సంక్షేమ హాస్టల్స్‌, స్కూల్స్‌ విద్యార్థులకు ఆర్‌.బి.ఎస్‌.కె టీమ్‌ ద్వారా స్క్రీనింగ్‌ పరీక్షలు చేయాలనీ, రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయాలనీ ఆన్నారు. పదవ తరగతి, ఇంటర్‌ విద్యార్థులను మినహాయించి, మిగితా విద్యార్ధులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయాలనీ ఆన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు అయిన తరువాత వారికి పరీక్ష లు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్ధులకు స్క్రీనింగ్‌ పరీక్షల వలన వారి నేర్పు, ఆరోగ్యం, మానసిక పరిస్థితులను తెలుసుకొని మెరుగైన వైద్యం అందించవచ్చని ఆన్నారు. ప్రతీ గురువారం విద్యార్ధులకు ఐరన్‌ ఫోలిక్‌ మాత్రలు తప్పనిసరిగా ఇవ్వాలని అందుకు %షఱటం% యాప్‌ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని ఆన్నారు. 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల పిల్లలకు పింక్‌ కలర్‌ మాత్రలు, 10 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల పిల్లలకు బ్లూ కలర్‌ మాత్రలు ప్రతీ గురువారం మధ్యహ్నం భోజనం అనంతరం ఇవ్వాలి ఆన్నారు. వంద రోజుల టిబి కార్యక్రమం లో భాగంగా టిబి పేషెంట్లకు పోషకాహారం ప్రతీ నెల అందించుటకు ఫుడ్‌ బాక్స్‌ లను నీక్షయ మిత్ర ద్వారా అందించడం జరుగుతుందని ఆన్నారు. జిల్లా లో గ్లాండ్‌ ఫార్మా కంపెనీ ఫుడ్‌ బాక్స్‌ లు అందించుటకు ముందుకు వచ్చిందని, అందుకు జిల్లాలోని ప్రతీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో టిబి పేషంట్ల వివరాల ప్రణాళికను సిద్ధం చేయాలనీ ఆన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, విధులకు సక్రమంగా హాజరు కావాలని ఆన్నారు. వేసవి దృష్ట్యా ఆశ వర్కర్స్‌ దగ్గర %ూRూ% ప్యాకెట్స్‌ అందుబాటులో ఉండాలని ఆన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ అభిగ్యాన్‌, %ణవీనూ% నరేందర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking