మధిర ప్రతినిధి (ప్రజాబలం) ఖమ్మం జిల్లా మధిర మండలంలో పనిచేస్తున్న తాపీ మేస్త్రీలతో జువారి సిమెంట్ కంపెనీ ప్రతినిధులు బుధవారం రాత్రి స్థానిక వాణి ట్రేడర్స్ & దివ్యశ్రీ ట్రేడర్స్ షాపు యజమాని నాళ్ళ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ అత్యంత నాణ్యత ప్రమాణాలతో జువారి సిమెంట్ తయారవుతుందన్నారు ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో జువారి సిమెంట్ నిలిచిందని తెలిపారు. పలు పరీక్షల ద్వారా తయారయ్యే ఈ సిమెంట్ పర్యావరణ పరిరక్షణగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డర్లు, గృహ నిర్మాణదారులకు తాపీ మేస్త్రీలు జువారి సిమెంట్ యొక్క నాణ్యత ప్రమాణాల గురించి తెలిపి బలమైన గృహ నిర్మాణాలకు సహకరించాలని వారు ఈ సందర్భంగా కోరారు. సమావేశంలో జువారి సిమెంట్ కంపెనీ టెక్నికల్ ఆఫీసర్ అజయ్, కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ దిలీప్, తాపీ మేస్త్రీలు పాల్గొన్నారు. తదుపరి తాపీ మేస్త్రీలకు గిఫ్ట్ అందజేశారు