రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 20 ఫిబ్రవరి 2025
మెర్రీ గో రౌండ్ బ్యాడ్మింటన్ క్లబ్ బెంగళూరు వారి గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ సందర్భముగా వారి ఆద్వర్యంలో జరుపుతున్న స్త్రీ పురుష ఆల్ ఇండియా గోల్డ్ మెడల్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కు తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ టీం కూడా పాల్గొంటుందని తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి రమణ తెలుపడం జరిగినది, ఇట్టి విషయమై మణికొండలోని అలకాపురి జయశంకర్ పార్కులో గల బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ గ్రౌండ్ లో టీమ్ మేనేజర్ వి. శ్రీనివాస్ రావు ఆద్వర్యంలో, కోచ్ ప్రకాశ్ యొక్క మార్గదర్శంనంలో శ్రవణ్, శ్రీను, సాయి, గోపి, మహేశ్, అనిల్, పెద్దిరెడ్డి, శివాజీ తది తర ఆటగాళ్ళు పాల్గొని ప్రాక్టీసు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని మణికొండ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ముఖ్య కార్యదర్శి, టీమ్ మేనేజర్ వి. శ్రీనివాస్, ముఖ్య సలహా దారుడు అందె లక్ష్మణ్ రావు, చీఫ్ పాట్రాన్ నవీన్ కుమార్ తమ అభిప్రాయాన్ని వ్యక్త పరచినారు.