ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 20 :
మందమర్రి మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తుంగపిండి రాజలింగు ను గురువారం తన చాంబర్ లో ఆర్.పి.ఐ.(ఎ) పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడికందుల తిరుపతి ఇతర నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శాలువార్త సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా ( ఏ) జిల్లా ఇంచార్జ్ పులిపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గరిగే వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎం.డి. యాకూబ్ పాల్గొన్నారు.