ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్, పిబ్రవరి 20:
మందమర్రి పట్టణంలోని ఊరు మందమర్రికి చెందిన మల్యాల తిరుపతి సుమారు 20 రోజుల క్రితం అకాల మరణం చెందగా వారి కుటుంబం జీవన ఉపాధి కోల్పోవడం జరిగింది. విషయం తెలుసుకున్న ఆటో కార్మిక సేవ సమితి సంఘం నాయకులు 25 కిలోల బియ్యం నెలకు సరిపడే నిత్యవసర సరుకులు వారి కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సేవ సమితి చైర్మన్ నేరెళ్ల వెంకటేష్, వైస్ చైర్మన్ భూకాల సంతోష్, ట్రెజరర్స్ చొప్పరి లక్ష్మీనారాయణ, బొల్లు రవి, డైరెక్టర్స్ బత్తిని రాజేష్, ఆకుల శ్రీనివాస్, గోసిక ప్రభాకర్, ఎం.డి ఇన్నుస్ నందిపాటి రవి, ఎగ్జిక్యూట్ నెంబర్స్ రెడ్డి ఐలయ్య, ఎనగందుల శ్రీనివాస్, కొంగ మల్లేష్, ఆవునూరి రాంబాబు, ఆవునూరి నాగరాజు పాల్గొన్నారు.