మందమర్రిలో తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ పిబ్రవరి 20:

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సిఐఎస్ఎఫ్ బ్యారెక్స్ లో ఈనెల 22, 23 తేదీలలో తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రంగు శ్రీనివాస్ గురువారం రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు తెలంగాణలోని 33 జిల్లాల నుంచి 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని వారికి భోజన వసతి కూడా సమకూరుస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి వాళ్లను మరింత ప్రోత్సహించడానికి ఇలాంటి పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking