ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 20 :
మందమర్రి పట్టణంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 13 మంది వాహనదారులకు ఫస్ట్ అడిషనల్ జే ఎఫ్ సి ఎం న్యాయస్థానం జడ్జి రెండు రోజులపాటు మంచిర్యాలలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుభ్రం చేయాల్సిందిగా సామాజిక సేవ శిక్ష విధించారు. ఈ మధ్యకాలంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న మందమర్రి పోలీసులకు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 13 మంది పట్టుబడ్డారు. వీరిని కోర్టులో హాజరుపరుచగా విచారించిన కోర్టు 13 మందికి రెండు రోజులపాటు పాఠశాలను శుభ్రం చేయాల్సిందిగా సామాజిక సేవ శిక్ష విధించారని పట్టణ ఎస్.ఐ శివనీతి రాజశేఖర్ తెలిపారు.