-బిఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 20:
మందమర్రి మండలంలోని అదిల్ పెట్ గ్రామ పంచాయితి పరిధిలోని ఎర్రచెరువు అభివృద్ధి చేసి రైతులకు నీరు అందేలా చెయ్యాలని కోరుతూ బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజక వర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ గురువారం ఇరిగేషన్ డివిజనల్ ఇంజనీర్ అధికారి శారదను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల క్రితం చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన వ్యవసాయ భూములు సంబంధిత శాఖా స్వాధీనం చేసుకోకపోవడంతో రైతుల
ఆధీనంలోనే ఉన్నాయన్నారు. చెరువు అభివృద్ధి కోసం కొనుగోలు చేసిన భూములను రికార్డుల నుండి తొలగించి సంబంధిత శాఖా స్వాధీనం చేసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన భూములకు హద్దులు గుర్తించి ట్రెంచ్ ఏర్పాటు చేసి చెరువు పూడిక తీసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు న్యాయం జరిగేంతవరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. వీరి వెంట బిఎస్పి నాయకులు సింగతి రంగనాథ్ పాల్గొన్నారు.