ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్.
మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్ల తూప్రాన్ పట్టణంలోని పుట్టకుట్ల ప్రాంతంలో ఉన్న మండలం ప్రాథమికోన్నత పాఠశాలలో జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ఆదేశాల మేరకు ఉదయం 9 గంటలకు విద్యార్థుల తల్లితండ్రులతో ఉపాధ్యాయుల సమావేశం ప్రధానోపాధ్యాయులు పట్లోరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో శనివారం రోజున నిర్వహించారు.ఈ సమావేశానికి 56 మంది విద్యార్థుల తల్లితండ్రులు హాజరైనారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల హాజరు,విద్యార్థుల ప్రగతి,పాఠశాల అభివృద్ధి లో తల్లితండ్రుల భాగస్వామ్యం,మధ్యాహ్న భోజనం,జ్వరాల రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని,విద్యార్థుల హాజరు,ప్రగతి పైన తల్లితండ్రుల అభిప్రాయాలపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చించారు.ఈ సమావేశంలో ఆంజనేయులు,గౌస్, గోపి,నరేష్,యాదగిరి, జయప్రకాశ్, వెంకటేష్, మహేందర్, స్వరూప, లావణ్య, శ్యామల, శారద, అనురాధ, నిర్మల, పద్మ, యూనిస్, రమేష్, పుష్ప, రాణి, ఉపాధ్యాయులు బృందం తదితరులు పాల్గొన్నారు.