ఈనెల 28న మెదక్​లో జిల్లా స్థాయి క్రీడోత్సవాలు…

ఇందిరాగాంధీ స్టేడియం, పీఎన్​ఆర్​ స్టేడియంలో క్రీడాపోటీల నిర్వహణ

మెదక్​ జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి

వై.దామోదర్​రెడ్డి

ప్రజా బలం దినపత్రిక మెదక్ జిల్లా నియోజకవర్గం
21.09.2024:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రాధాన్యతనిస్తూ ఈనెల 28వ తేదీన జిల్లా కేంద్రమైన మెదక్​ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం, పీఎన్​ఆర్​ స్టేడియంలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, కీరడల శాఖ అధికారి వై.దామోదర్​రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి జిల్లా స్థాయి యువజనోత్సవాలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాస్థాయి ఈనెల 28న ఉదయం 10 గంటల నుంచి జిల్లా కేంద్రం మెదక్​లోని ఇందిరా గాంధీ అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించే క్రీడలకు 15 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులకు పోటీలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే సాంస్కృతిక విభాగం పోటీలను ఇందిరా గాంధీ అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వివరించారు. క్రీడలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి… జానపద నృత్యం (బృందం) (ఫోక్ డాన్స్ గ్రూప్ ), జానపద నృత్యం (వ్యక్తిగత/సోలో) (ఫోక్ డాన్స్ సోలో ), జానపద గీతాలు (బృందం) (ఫోక్ సాంగ్ గ్రూప్ ), జానపద గీతాలు (వ్యక్తిగత / సోలో) (ఫోక్ సాంగ్ సోలో ), అలాగే… హస్తకళలు, వస్త్రం, ఆర్గో ఉత్పత్తులు, కథా రచన, పెయింటింగ్, డిక్లమేషన్/ఎల్యుకేషన్ పోటీలను స్థానిక పీఎన్​ఆర్​ ఇండోర్​ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రీడలు ఆయా మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించడం జరుగుతుందని… ప్రథమ స్థానంలో గెలుపొందిన ఒక జట్టును జిల్లా స్థాయిలో ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు పంపడం జరుగుతుందని… రాష్ట్ర స్థాయి పోటీలలో ఎంపికైన వారు 2025 జనవరి 12వ తేదీ నుంచి 2025 జనవరి 16వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని దామోదర్​రెడ్డి తెలిపారు. ఈ క్రీడల్లో పాల్గొనే వారి అర్హతలు జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనే యువతీ యువకులు మెదక్ జిల్లా నివాసులుఅయి ఉండి వయస్సు పోటీ నిర్వహించు తేదీ నాటికీ 15 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు కలిగి ఉండాలని… గత మూడు సంవత్సరాల్లో నిర్వహించబడిన జాతీయ యువజన ఉత్సవాల్లో పాల్గొన్న యువతీ, యువకులు లేదా గ్రూపులు ఈ పోటీలలో పాల్గొనేందుకు అనర్హులని ఆయన వివరించారు. క్రీడల్లో అర్హులైన వారు పాల్గొనదల్చినట్లయితే మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు. సామూహిక ప్రదర్శనల ఫొటోలు, జానపద నృత్యం (బృందం) వారు ఒక్కో బృందంలో 10 మంది మాత్రమే ఉండాలని… ప్రదర్శనలో జానపద నృత్యలు భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉండాల్సిందిగా…ప్రదర్శనకు 15 నిమిషాల సమయం మాత్రమే ఉంటుందన్నారు. అలాగే జానపద నృత్యం (వ్యక్తిగత/సోలో)లో ఒక్కో బృందంలో 5 మంది మాత్రమే పాల్గొనాలని… ప్రదర్శనలో జానపద నృత్యాలు భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలని… ప్రదర్శనకు 15 నిమిషాలు సమయం మాత్రమే ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. జానపద గీతాలు (బృందం) ఒక్కో గ్రూపులో 10 మంది మాత్రమే ఉండాలని… ప్రదర్శనలో జానపద గేయాలు భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉండటంతో పాటు సినిమా పాటలకు అనుమతిలేదని తెలిపారు. జానపద గీతాలు (వ్యక్తిగత/ సోలో) ఒక్కో బృందంలో 5 మంది మాత్రమే ఉండాలని.. ప్రదర్శనలో జానపద గేయాలు భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉండాల్సిందిగా సినిమా పాటలు అనుమతించబడవని తెలిపారు. దీంతో పాటు గ్రూపు విభాగాల్లో యువతీ యువకులు పాల్గొనవచ్చని వాయిద్య పరికరాలు పోటిలో పాల్గొనే కళాకారులు వెంట తీసుకురావాల్సిందిగా లైవ్ ప్రదర్శన చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ పోటీలలో పాల్గొనే వారికి ఉచితంగా మధ్యాహ్న భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి దామోదర్​రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన కళాకారులు, యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking