మెగా వైద్య శిబిరం.

 

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి మే 23

కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెం గ్రామం నందు జమ్మికుంట లోని అమృత హాస్పిటల్ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఇట్టి వైద్య శిబిరానికి సుమారుగా 400 ల మంది వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి సుమారుగా 80000 రూపాయల విలువగల మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది. ఇట్టి వైద్య శిబిరంలో వైద్యులు డా. భావనారెడ్డి నరాల వైద్య నిపుణులు,డా.ప్రశాంత్ రెడ్డి గుండె వైద్య నిపుణులు,డా. శ్రీనివాస్ జనరల్ ఫిజిషియన్, డా.విజేత రెడ్డి ఛాతి వైద్య నిపుణులు మరియు హాస్పిటల్ సిబ్బంది తమ సేవలను అందించడం జరిగినది. ఇట్టి వైద్య శిబిరానికి మర్రిపెల్లిగూడెం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్లకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా అమృత హాస్పిటల్ మరియు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ఎల్క దేవేందర్ రెడ్డి పేద ప్రజలకొరకు ముందు ముందు మరిన్ని గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.వైద్య శిబిరానికి సహకరించిన గ్రామ పంచాయితి కార్యాలయ సిబ్బంది మరియు గ్రామ పెద్దలకు హాస్పిటల్ యాజమాన్యం ప్రత్యేక కృత్ఞతలు తెలియజేయటం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking