రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 1 నవంబర్ 2024
పీ.సి.బి సెక్రటరి నీ కలసిన ది సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులు
మణికొండ మునిసిపల్ పరిధిలో దాదాపు 15000 మంది జనాభా గల మై హోమ్ అవతార్, హాల్ మార్క్ విసీనియా గృహ సముదాయాల దగ్గరలో సరియగు అనుమతులు లేకుండా నెలకొల్పిన బిల్డర్ వాసవి అట్లాంటిస్ పేరుతో క్యాప్టివ్ రెడీ మిక్స్ ప్లాంట్ కి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారు పర్మిషన్ ఇవ్వగా ప్రస్తుతం ఆర్డిసి కాంక్రీట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనుమతులకు వ్యతిరేకంగా చుట్టుపక్కల ఉండే ప్రజానీకానికి కాలుష్యం వెదజల్లుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదనీ రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ పునరుద్దరణ ఫలితంగా చిన్న పిల్లలు, వయసు మళ్ళిన వృద్దులు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారని, అనారోగ్యాల పాలౌత్త్తున్నారని, భారీ వాహనాల రాక పోకల దృష్ట్యా ఉన్న రహదారి కాస్తా పూర్తిగా దెబ్బ తిన్నందు వలన ప్రస్తుతం చిన్న పిల్లల పాఠశాల వాహనాలు సైతం తిరుగ లేక పిల్లలు పెద్దలు అందరూ నరక యాతన పడుతున్నారని ముక్త కంఠంతో అరచి యాగి చేసినను పట్టించుకొనే నాథుడు కరువై నాడనీ తెలుసుకొని ఇట్టి సమస్య పరిష్కార నిమిత్తమై కాలుష్య నియంత్రణ మండలి (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) మెంబర్ ని ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు అందె లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శి షేక్ ఆరీఫ్ మొహమ్మద్, ఉప కార్యదర్శి బొమ్ము ఉపేందరనాద్ రెడ్డి, స్థానిక నివాసులు గౌతం కృష్ణ, హాసీం, మణికంఠ తది తరులు కలసినారు.
