రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 05 జూలై 2024:
ప్రజా ప్రయోజనార్థం ఎల్లవేళలా ముందుండే ది సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులు, హైదరాబాద్ మెట్రో పొలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎచ్ ఎం డీ ఏ) కమిషనర్ గా సర్ఫరాజ్ అహ్మద్ ఐ.ఏ.ఎస్ విచ్చేసిన సందర్భంగా మర్యాద పూర్వకంగా అందె లక్ష్మణ్ రావు ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు, ముఖ్య కార్యదర్శి షేక్ ఆరీఫ మొహమ్మద్ మరియు కార్యదర్శి ఉపెందర్నాథ్ రెడ్డిలు కలసి పుష్పగుచ్చంతో స్వాగతిస్తూ, శుభాభివందనములు తెలిపినారు, మాటా మంతీ సందర్భముగా అవినీతికి మారు పేరుగా మణికొండ పుర పాలక సంఘ పరిధి చెలామణి అవుతున్నధని, ఇక్కడ పార్క్ స్థలాలు, ఖాలి స్థలాలు కబ్జాకు గురవుతున్న పట్టించుకొనే నాథుడు లేడని, ఎచ్.ఎం.డీ.ఏ అనుమతి పొందిన లే-అవుట్ లోని రహదారుల రెండు వైపులా ప్లాట్ యజమానులతో ఒప్పందం కుదుర్చుకునీ ప్లాట్ల మధ్యన ఉన్న రహదారులను కబ్జా చేసి కట్టడాల్లో కలుపేసుకొని ముందుకు సాగడం మాములు విషయంగా మారింది, ఫెక్ టీ.డీ.ఆర్ లు జత చేసి కొంత మంది జత చేయకుండా 5, 6 అంతస్తులు కట్టడం ఇక్కడ మాములు విషంయంగా ఉన్నది, లెక్క ప్రకారం ఎచ్.ఎం.డీ.ఏ అనుమతులు పొంది, లెక్క ప్రకారం సరియగు కట్టుబడి మొత్తంగా జరిగిన తదుపరి ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ జతచేసి విద్యుత్చక్తి కొరకై, వాన నీటి విడుదలకై, మురుగు నీటి డ్రైనేజీ మొదలగు మౌలిక సదుపాయాలు కల్పించి వ్యవస్థ కొరకై ముందుకు సాగాలని కానీ ఇక్కడ ఎచ్.ఎం.డీ.ఏ మంజూరు చేసిన ఎల్.ఆర్.ఎస్ పుణ్యమాని కట్టడం పూర్తి కాకుండా ఆక్యుపేషన్ సర్టిఫికెట్ లేకుండా డ్రైనేజ్, నీటి పారుదలకు, విద్యుత్చక్తి కనెక్షన్ లు తీసుకుంటున్నను అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు చూసి చూడకుండా ముందుకు సాగుతున్నారనీ, అన్ని అనుమతులు వాటంతట అవే మంజూరు కావడం ఆనవాయితీగా మారిన దనడానికి పెద్ద నిదర్శనంగా ఏంబియన్స్ కోర్ట్ అపార్ట్మెంట్ లోని దాదాపు 850 రెసిడెన్షియల్ ఫ్లాట్ లు హైదరాబాద్ పరిధిలో కట్టడడమే కాకుండా మురుగు నీటి పారుదల మణికొండ పరిధి లోని పందెం వాగులో కలపడానికి చేస్తున్న ప్రయత్నమే పెద్ద నిదర్శనంగా నిలుస్తుంది, ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకొని అన్ని రుజువులు జత పరచి తనను మళ్లీ కలువమని ఎచ్.ఎం.డీ.ఏ కమిషనర్ చెబుతూ తాను తప్పకుండా చర్యలు తీసుకుంటానని తెలుపడం జరిగినదనీ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలియ జెసినారు.