మియాపూర్ ప్రజాబలం ప్రతినిధి: శేరిలింగంపల్లి నియోజకవర్గం లో గల మియాపూర్ డివిజన్ లోని
మక్త పోచమ్మ దేవాలయంలో పోచమ్మ దేవాలయ కమిటీ సభ్యులు మక్త గ్రామస్తులకు, భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు. ప్రతీ సంవత్సరం ఆషాడ మాసం లో గ్రామం లోని పోచమ్మ దేవతకు గ్రామస్తుల%శీ%దరు భక్తిశ్రద్దలతో భోనాలు సమర్పించిన అనంతరం ఒడిపబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా చేయడం గ్రామం లో అనాదిగా వస్తున్న ఆచారమని, గ్రామస్తులు సుఖసంతోషాలతో ఉంటారని వారి నమ్మకమాని కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామం లో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు, కష్ఠాలు రాకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు, అ పోచమ్మ తల్లి అనుగ్రహం గ్రామస్తులఫై ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.