జిల్లా ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌. బి. ఆర్‌. అంబేద్కర్‌ గారి విగ్రహమునకు పాలాభిషేకం

కుకుట్‌పల్లి ప్రజాబలం ప్రతినిధి: ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిన శుభ తరుణంలో..కూకట్‌ పల్లి నియోజకవర్గం బాలానగర్‌ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌. బి. ఆర్‌. అంబేద్కర్‌ గారి విగ్రహమునకు పాలాభిషేకం చేసిన మేడ్చల్‌-మల్కాజ్‌ గిరి జిల్లా ఎస్సీ సెల్‌ వైస్‌ ఛైర్మన్‌ మదన్‌ మోహన్‌, కూకట్‌ పల్లి ఏ బ్లాక్‌ ఎస్సీ సెల్‌ వైస్‌ ఛైర్మన్‌ జల్లా శివ కుమార్‌.. ఈ కార్యక్రమంలో టిపిసిసి మహిళ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి శ్రీమతి కొండకింది పుష్పారెడ్డి, మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ లక్ష్మయ్య, జిల్లా ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ ముకేందర్‌, కన్వీనర్‌ ప్రకాష్‌, పులి శ్రీకాంత్‌ పటేల్‌ , చంద్రశేఖర్‌, యువజన కాంగ్రెస్‌ నాయకుడు భరత్‌, అనిల్‌, కమల్‌, మరియు ఎస్సీ సెల్‌ మహిళ నాయకురాల్ళు సాయి భారతి, రేణుక, విజయ కుమారి, శ్వేత, పద్మావతి, నాగేంద్రమ్మ, మరియు కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking