ప్రజాబలం బెల్లంపల్లి నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 16 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేయడమైనది ఉచితంగా ఆదివారం రోజున భవన నిర్మాణ కార్మికులకు నిరుపేదలకు కూలీలకు ప్రయాణికులకు చిరువేపారస్తులకు 300 మంది పైగా అల్పాహారం పంపిణీ చేయడమైనది,ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు బెల్లంపల్లి అంబేద్కర్ చౌరస్తా మార్కెట్ ఏరియాలో ఉచితంగా అల్పాహారం పంపిణీ ఉంటుందని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కంటెవాడ నాగేష్ కుమార్,గెల్లీ జయరాం యాదవ్,గంట శ్రీనివాస్,కందుల సత్తయ్య,భోగ శ్రీనివాస,నాగుల లింగయ్య,కనకయ్య గౌడ్, కోయాడ శంకర్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.