అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి మహంకాళి బిక్షపతి

 

ప్రజాబలం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 16:జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్థానిక బాలాజీ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ మహనీయులకు ఆదివారం భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 27వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిదులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓబిసి చైర్మన్ పసుపులేటి వీర భాస్కరావు హాజరై అంబేద్కర్ మహనీయులకు పూలమాలలు సమర్పించారు,ఈ సందర్భంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నిర్వాహకులు మహంకాళి బిక్షపతి, భారత రాజ్యాంగంలోని 27వ ఆర్టికల్ ఏదైనా నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడానికి పన్నులు చెల్లించే స్వేచ్ఛ ఏ వ్యక్తి అయినా ఎలాంటి పన్నులు చెల్లించమని బలవంతం చేయకూడదు. వాటి ద్వారా వచ్చే ఆదాయం ఏదైనా నిర్దిష్ట మతం మతపరమైన తెగల ప్రచారం లేదా నిర్వహణ కోసం ఖర్చుల చెల్లింపులో ప్రత్యేకంగా కేటాయించబడుతుంది అని ఆర్టికల్ 27 తెలియజేస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు, గాదే రమేష్, గడ్డం గిరి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గడ్డం శీను, జిల్లా కన్వీనర్ మొగిలి పాక వెంకటేష్, దున్నపోతుల నరసింహ, విజయ శంకర్, యాదగిరి, వి వెంకటేష్, వి రామారావు, తిరుపతి వరుకుప్పల వెంకటేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొని పార్టీలకు మతాలకు కులాలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అని అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking