శ్రీ వైష్ణవ అయుత చండీ అతి రుద్రం శ్రీ సీతా రామ సామ్రాజ్య పట్టాభిషేకం 86 వ విశ్వశాంతి మహాయాగ మహాత్సవంలో పాల్గొన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 16 : మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సి సి సి పోలీస్ స్టేషన్ ఎదురుగా వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ కాలచక్రం శ్రీ వైష్ణవ అయుత చండి అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం 86 వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు,తనయుడు కొక్కిరాల ఉదయ్ చరణ్ రావు.ఆ స్వామి వారి ఆశీస్సులతో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుని, వారి తనయుడిని అర్చకులు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking