చెస్ గ్రాండ్ మాస్టర్ పెంటాల హరికృష్ణ
జూబ్లీహీల్స్ ప్రజాబలం ప్రతినిధి: భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ పెంటాల హరికృష్ణ తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
2024 ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఎఫ్‌ఐడీఈ 45 వ చెస్ ఒలంపియాడ్‌లో స్వర్ణ పథకంతో పాటు చైనా హెంగ్జ్యూ లో 2022 లో జరిగిన ఏసియన్ గేమ్స్‌లో సాధించిన సిల్వర్ మెడల్‌ను చూపించగా, ముఖ్యమంత్రి హరికృష్ణ ని అభినందించారు.
పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ , తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి కూడా ఉన్నారు.