ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 18 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 002 – పెద్దపల్లి (ఎస్.సి) పార్లమెంటు నియోజకవర్గానికి ఎన్నికల ఖర్చుల పరిశీలకులుగా నియమించబడిన సమీర్ నైరంతర ఐ.డి.ఎ.ఎస్ గురువారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎస్.టి.పి.సి లో గల జ్యోతి అతిధి గృహానికి వచ్చినందున జిల్లా పాలనాధికారి కలెక్టర్ బదావత్ సంతోష్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేసి స్వాగతం ఫలితాలు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజవర్గ పరిధిలో జరుగునున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా రాజకీయ పార్టీలు,అభ్యర్థులు ప్రచారంలో భాగంగా చేయునున్న ఖర్చుల వివరములను పర్యవేక్షిస్తారని తెలిపారు.