స్వర్ణ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంవచ్చిన తర్వాతనే మత్స్యకారులు ఆర్థికంగా బలపడినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు లో మంత్రి జిల్లా పాలనాధికారితో కలసి చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 6 సం లనుండి స్వయంగా వారే ఆలోచించి చెరువుల లో మట్టి తీయాలి తూములు రిపేర్ చేయాలి తరువాత చేప పిల్లలను వదిలేసి అవి పెరిగి అమ్ముకోవడం వల్ల మత్స్యకారులు ఆర్థికంగా ఎదుగుతరాని గ్రహించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిర్మల్ స్వర్ణ ప్రాజెక్టులో 17 లక్షల 50 వేల చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు.నిర్మల్ లో చెరువులు ఎక్కువగా ఉన్నాయని ప్రాజెక్టులు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.70 ఏళ్ల స్వతంత్ర దేశంలో చేపలను చెరువులలో వదిలి వాటికి అమ్ముకోవాలన్న ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరికే వచ్చిందన్నారు.చేపలు తింటే ఆరోగ్యం గా ఉంటారని డాక్టర్లు కూడా చెపుతున్నారని చేపలకు చాలా డిమాండ్ ఉందన్నారు. నిర్మల్ లో మొత్తం 4కోట్ల 75 లక్షల చేప పిల్లలు వదులుతున్నట్లు తెలిపారు.చేపలు అమ్ముకోడానికి మోపెడ్ లు, ఫోర్ వీలర్ వాహనాలు,వలలు, మొబైల్ వాహనాలు ప్రభుత్వం ఇచ్చినట్లు తెలిపారు.
జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ నిర్మల్ లో 1కోటి తో ఫిష్ మార్కెట్ 1కోటి తో మత్స్య భవన్ నిర్మించినట్లు తెలిపారు.32 కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking