సిద్ధార్థ్ విద్యా సంస్థలలో అట్టహాసంగా క్రీడా పోటీలు.

 

మెదక్ ప్రజా బలం న్యూస్ :-

ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జన్మ దినాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని సిద్ధార్థ్ విద్యా సంస్థలలో క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ సంద్భంగా క్రీడాకారులను ఉద్దేశించి సిద్ధార్థ్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ కె .శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతాయని కొనియాడారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కె. సంధ్యా రాణి మాట్లాడుతూ.. విద్యార్థులు ధ్యాన్ చంద్ లాంటి క్రీడా కారులను స్ఫూర్తిగా తీసుకోవాలని , గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలని తెలియజేశారు. తదనంతరం పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచీల ఇంచార్జీలు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking