లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు అర్హులైన లబ్దిదారులకు రుణాలు అందించాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 29:
మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన జిల్లాలోని బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు, అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య అధ్యక్షతన గత జూన్ త్రైమాసికంలో జిల్లా పనితీరును సమీక్షించడానికి సమావేశం జరిగింది. అనంతరము సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ఇప్పటి వరకు బ్యాంకులు జూన్ త్రైమాసికంలో 67.70% లక్ష్యాన్ని సాదించినదుకు బ్యాంకర్లందరినీ అభినందిచారు, లక్ష్య సాధనలో వెనుకబడిన బ్యాంకర్లు తమ పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు. రైతులకు పంట రుణాలు, టర్మ్ లోన్ లు, వ్యవసాయ అనుబంధ రుణాలు విరివిగా అందించాలని సూచించారు. ఎస్సి,ఎస్టీ,బిసి, మైనారిటీ , పరిశ్రమలు, డిఆర్ డిఓ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకులు ఉపాధి యూనిట్ల స్థాపన, చిన్న, మధ్య తరహా, విద్య, గృహ నిర్మాణం,, ఇతర ప్రాధాన్యత రంగాలకు అర్హులైన పేద లబ్దిదారులకు మంజూరు చేయాలనీ కోరారు. చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి అవగాహన కలిగిస్తూ విరివిగా రుణాలు అందించాలని కోరారు. ప్రభుత్వ శాఖల అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు నిర్ణిత గడువులోగా రుణాలు మంజూరు చేయాలనీ అన్నారు.బ్యాంకులో దరఖాస్తులు పెండింగులో లేకుండా చూసుకోవాలని, తిరస్కరణకు గురైన వాటిని పరిశీలించి తగు రీతిలో బ్యాంకులు పంపాలని అధికారులకు సూచించారు. ప్రతి నెలకొకసారి లేనిచో రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా బ్యాంకర్స్ బెనిఫిషరీ మీటింగ్ ఏర్పాటు చేయవలసిందిగా కోరినారు. స్వయం సహాయక సంఘాల రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే విధంగా బ్యాంకర్లు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వన్ టైం సెట్టిల్మెంట్ పై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆర్ధిక అక్షరాస్యత, నగదు రహిత డిజిటల్ లావాదేవీలపై అవగాహనా కలిగించాలని బ్యాంకర్లకు సూచించారు.
ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసులు, ఆర్బిఐ ఎల్ డి ఓ తాన్య, నాబార్డ్ డీడీఎం సురభి, జి ఎం డి ఐ సి రవీందర్, జడ్పీ సీఈవో దేవసహాయం జిల్లా వ్యవసాయాధికారిణి మేరీ రేఖ, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి, , ఆయా బ్యాంకుల మేనేజర్లు, డీఆర్డీవో పద్మజ రాణి, మెప్మా, ఎస్సీ కార్పొరేషన్, డీఐసీ, కేవీఐసీ, ఆర్బీఐ, నాబార్డుతో పాటు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking