నీలం మధు ముదిరాజ్ కే పటన్చెరువు టికెట్ ఇవ్వాలి

ముఖ్య మంత్రి కెసిఆర్ కు ముదిరాజ్ సంగాలనేతల విజ్ఞప్తి
హైదరాబాద్ ఆగష్టు 29: పటాన్చెరువు నియోజవర్గం శాసన సభ స్థానాన్ని బిఅర్ఎస్ పార్టీ నీలం మధు ముదిరాజ్ కే కేటాయించాలని పలువురు ముదిరాజ్ సంగాలకు చెందిన నేతలు ముఖ్య మంత్రి కెసిఆర్ ను డిమాండ్ చేసారు.ఈ మేరకు ముదిరాజ్ మహాసభ కు చెందిన రాష్ట్ర మహిళా నాయకురాలు నందిమల్ల నిర్మల ముదిరాజ్ నేతృత్వంలో ముదిరాజ్ మహాసభకు చెందిన దీపిక ముదిరాజ్,నందకిశోర్ తోపాటు పలువురు ముదిరాజ్ నాయకులు చిట్కుల్ గ్రామంలో నీలం మధు ముదిరాజ్ ను కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా నిర్మల ముదిరాజ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ తరపున 115 మందిని ప్రకటిస్తే అందులు బిసిలకు కీవళం 21 స్థానాలను కేటాయించి తీరని అన్యాయాన్ని చేసారని విమర్శించారు.ముఖ్యంగా బిసి లలో60 లక్షల జనాబా గల ముదిరాజ్ లకు కనీసం ఒక్క సీటు కుడా కేటాయించక పోవడం దారుణమన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినా నీలం మధు ముదిరాజ్ ఎంఎల్ఏ పోస్ట్ కు అన్ని విదాల అర్హుడు అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ లో కొనసాగుతూ పార్టీ తో పాటు సామాజికంగా అనేక సీవా కార్యక్రమాలను నిర్వహించారని ప్రజల్లో తనకంటూ గుర్తింపు పొందారన్నారు. నీలం మధు వెంటే ముదిరాజ్లు ఉన్నారని, మేం నడుస్తామని పేర్కొన్నారు.పార్టీలకతీతంగా ముదిరాజులందరూ సబ్బండ వర్గాలు ఒకేతాటిపైకి వచ్చి గెలిపించుకుంటామని వారు తెలిపారు. నీలం మధు ముదిరాజ్ ను బీసీ సబ్బండ వర్గాల నేతగా పూర్తి మద్దతు అంద జేసి గెలిపించి అసెంబ్లీకి పంపుతామని తెలిపారు.పటాన్చెరువు మున్సిపాలిటీలకే పరిమితం కాకుండా జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు న్యాయం జరిగే వరకూ ఏకగ్రీవ తీర్మానాలు చేసి మద్దతుగా నిలుస్తామని తెలిపారు. సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking