వైద్య కళాశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..శుక్రవారం నాడు 15వ తేదీన జిల్లాలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, వర్చువల్ విధానం ద్వారా ప్రారంభోత్సవం చేయనున్న సందర్బంగా గురువారం దానికి సంబంధించి న ఏర్పాట్లను అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలసి
పరిశీలించారు,
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కు మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి సదా రుణపడి ఉంటామని అన్నారు. రేపు నిర్మల్ లో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుందని, అందుకోసం విద్యార్థులు, ప్రజలతో ఎన్ టి ఆర్ మినీ స్టేడియం నుండి ర్యాలీ గా బయలుదేరి మెడికల్ కాలేజీ వరకు చేరుకొని కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు. ఇప్పటికే 100 సీట్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిందని,అందులో 65 మంది మహిళలు, 35 మంది పురుషులు ఉన్నారన్నారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా హాస్టల్ వసతి ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ కాలేజీ తాత్కాలిక భవనమే అయినప్పటికీ, సంవత్సరం న్నర లోగా కాలేజీ భవనాన్ని పూర్తి చేస్తామన్నారు. దానికి సంబంధించి 66 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తయిందని అన్నారు. ఒకప్పుడు తెలంగాణా వ్యాప్తంగా 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, కానీ ఇప్పుడు జిల్లాకు ఒకటి చొప్పున 33 కాలేజీలు మంజూరు అయ్యాయని అన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పడటం వలన చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళకుండానే వైద్య విద్యను అభ్యసించవచ్చని అన్నారు. మెడికల్ కాలేజీ లోని విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా మెరిట్ పద్దతిలో జరిగిందని అన్నారు. కళాశాల ప్రారంభోత్సవం తర్వాత రేపటి నుండే తరగతులు ప్రారంభం అవుతాయని అన్నారు.
ఎన్టీఆర్ స్డేడియం నుంచి దివ్యా గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఈ ర్యాలీ ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.