హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:జాతీయ నులిపురుగులు నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా హైదరాబాద్ లోని షేక్ పేట లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో ఆల్బండజల్ టాబ్లెట్స్ ను విద్యార్థులకు అందించారు .
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ , ప్రవేట్ పాఠశాల లతో పాటు అంగన్‌వాడీలలో సుమారు 98 లక్షల మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నామన్నారు .

పిల్లల ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదని మంత్రి దామోదర్ రాజనర్సింహా వెల్లడిరచారు .
పిల్లలే జాతి సంపద అన్నారు , ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలందరూ ఆల్బండజల్ టాబ్లెట్స్ ను వేసుకోవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ , హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు