ఖర్గే, రాహుల్‌, ప్రియాంక, ఎంపీ ల అరెస్ట్‌ అక్రమం… అప్రజాస్వామిక చర్య. టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌..

నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి: ఓట్ల చోరీ పై ఆధారాలతో సహా నిరూపించి దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే, లోక్‌ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఎంపీ లు ప్రియాంక గాంధీ ఇండియా కూటమి ఎంపీలను ప్రధాని మోడీ సర్కారు ఢల్లీిలో అరెస్ట్‌ చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తీవ్రంగా ఖండిరచారు.
ఎన్నికల సంఘాన్ని కలిసి ఓట్ల చోరీ పై వినతి పత్రం ఇస్తామని శాంతి యుతంగా వెళ్తున్న ఎంపీలను అరెస్ట్‌ చేయడం అక్రమమని, అప్రజాస్వామ్యమని ఆయన అన్నారు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేసి ఓట్‌ చోరీ పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking