కల్వకుంట్ల కవిత ది సింగరేణి కార్మికులను మోసం చేసిన 10 ఏళ్ల బహిరంగ చరిత్ర – ఇప్పుడు కళ్ళలో మట్టికొట్టే కల్లబొల్లి మాటలు!

INTUC సెక్రటరీ జనరల్  బి. జనక్ ప్రసాద్
పది సంవత్సరాలు అధికారంలో ఉండి, సింగరేణి గుర్తింపు సంఘం గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరించిన కవిత, సింగరేణిని దోచి, నాశనం చేసి, ఇప్పుడు ఇంట్లో పంచాయతీ పెట్టుకుని HMS తో పొత్తు అంటూ ప్రెస్ మీట్ పెట్టి కల్లబొల్లి మాటలు చెబితే, కార్మికులు నమ్మే పరిస్థితి లేదు.
•కవిత, మీ మాటలు మీకే సరిపోవు: సంవత్సరానికి 5 కొత్త బొగ్గు గనులు ఓపెన్ చేస్తామన్న మీరు, 10 ఏళ్లలో ఒక్క కొత్త గని కూడా ఎందుకు తెరవలేదు?
•కార్మికుని సొంత ఇంటి కల, పర్క్స్, ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తామని గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేదు? ఇప్పుడు ఎందుకు గొంతెత్తుతున్నారు?
•రాజకీయ జోక్యం: గత 10 ఏళ్లలో సింగరేణి నిధుల నుండి కార్మికుల 30 వేల కోట్లు దుర్వినియోగం చేసి, MLA, మంత్రులకు 2 కోట్ల చొప్పున పంచింది TBGKS, BRS కాదా?
•ఎన్నికల్లో కార్మికుల తీర్పు: ఈ అవినీతి ఫలితమే, కోల్ బెల్ట్‌లో BRS MLAలను చిత్తుగా ఓడించారు. గుర్తులేదా?
•గుర్తింపు సంఘం పరాభవం: 10 ఏళ్లు గుర్తింపు సంఘంగా ఉన్న TBGKS, చివరి ఎన్నికల్లో పోటీ కూడా చేయలేని స్థితికి చేరింది అంటే ఆ సంఘం అవినీతి ఎంత దారుణమో కార్మికులకు బాగా తెలుసు.
•12/3 సెటిల్మెంట్: 10 ఏళ్లలో మీ ప్రభుత్వం ఏమి చేసింది? 22 వేల కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని మీరు చెబుతారు, కానీ అసెంబ్లీలో “ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కూడా లేడు” అని కెసిఆర్ చెప్పిన మాట మర్చిపోయారా?
•కాంగ్రెస్ ఘనత: దేశంలో ఎక్కడా లేని విధంగా కాంట్రాక్టు కార్మికులకు ₹5,000 బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.
•HMS అవమానం: మొన్నటికి దాకా కేసీఆర్, కవితపై తీవ్రంగా విమర్శలు చేసిన HMS నేత కామ్రేడ్ రియాజ్ గారు, ఇప్పుడు కవిత కాళ్ల దగ్గర HMS ను తాకట్టు పెట్టడం కార్మికుల గౌరవానికి అవమానం.
కవితకు STPP గురించి కనీసం మాట్లాడే  అర్హత హక్కే లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప సీఎం భట్టి విక్రమార్క నాయకత్వం, కార్మికుల కృషి వల్లే సింగరేణి ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి, లాభాలు సాధించింది.
•లాభాల వాటా: పర్మినెంట్ కార్మికులకు మాత్రమే కాదు, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాల వాటా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.
•భీమా రక్షణ: రూపాయి ఖర్చు లేకుండా పర్మినెంట్ కార్మికులకు ₹1 కోటి ప్రమాద భీమా, కాంట్రాక్ట్ కార్మికులకు ₹40 లక్షల ప్రమాద భీమా – ఇది కాంగ్రెస్ ఇచ్చిన గౌరవం.
•వయో పరిమితి పెంపు: 35–40 ఏళ్ల వయో పరిమితి పెంపు కోసం 10 ఏళ్లు BRS మోసం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో 2 నెలల్లోనే పెంచింది

Leave A Reply

Your email address will not be published.

Breaking