ఆందోల్ ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ కార్యకర్తలకు విజ్ఞప్తి.

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి (జులై 12 ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా:రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, సంగారెడ్డిలోని తన నివాసంలో, ఆందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యాచరణను, రూపొందించుకోవాలని ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ప్రజా ప్రభుత్వం అధికారలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను,దశలవారిగ అమలు చేస్తున్నమన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి,రైతు భరోసా, భూభారతి, రైతుల రుణమాఫీ, రైతు భీమాలను, అమలు చేయడంతో పాటు, పెన్షన్లు, కొత్త రేషన్ కార్డుల,జారీ సన్నబియ్యం, ధాన్యం కొనుగోల్లు, సన్నాలకు 500,రూపాయల బోనస్ లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నమన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకి వివరించాలని ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ, కార్యకర్తలను కోరారు. ఆందోల్ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో విద్య, వైద్య, రంగాల అభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇప్పటికే ఆందోల్ నియోజకవర్గం హెల్త్ ఎడ్యుకేషన్ల హబ్ గా తీర్చిదిద్దామన్నారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నమన్నారు.ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులను గుర్తించి ఇంటింటికి వెళ్లి ప్రజా ప్రభుత్వం గత 18 నెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివరించాలని మంత్రి కోరారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా,కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలలో మండలాలలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలా కృషి చేయాలని కోరారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు, అందులో భాగంగా రోడ్ల మరమ్మత్తులు , కొత్త రోడ్ల నిర్మాణం, పాఠశాలలలో, ఆసుపత్రులలో, మౌలిక సదుపాయాల కల్పనకు, పెద్దపీట వేస్తున్నమన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్స్, సంక్షేమ హాస్టల్లో,జూనియర్, డిగ్రీ కళాశాలలో, నర్సింగ్ కళాశాలలో, పాలిటెక్నిక్ కళాశాలలో,విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నమన్నారు. నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్సు ట్రైనింగ్ ఇన్ ఇన్స్టిట్యూట్ను, డెవలప్మెంట్ సెంటర్లను స్కూల్లలోను, నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కార్యకర్తలకు వివరించారు.


ఆందోల్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిలారపు త్రిష దామోదర్ రాజనర్సింహ, పిసిసి ఉపాధ్యక్షులు సంగమేశ్వర్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, పిసిసి సభ్యులు కిషన్, AMC చైర్మన్లు సుధాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్లు మల్లారెడ్డి, కచూర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు,దిగంబర రావు, శేషారెడ్డి, రమేష్, నిమ్మ రమేష్ , బాలాజీ నర్సింహులు, పద్మనాభరెడ్డి, దశరథ్ , దుర్గారెడ్డి, పోలీసు కృష్ణ, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking