కోట శ్రీనివాస రావు మృతి పట్ల సంతాపం తెలిపిన

తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీమతి ప్రియాంక
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాస రావు మృతి పట్ల తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీమతి ప్రియాంక సంతాపం తెలిపారు. వైవిధ్యమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన మరణం విచారకరమన్నారు. కళారంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఎన్నో మధురమైన పాత్రలు.. విలన్‌ గా, ఆర్టిస్టుగా ఆయన పోషించిన పాత్రలు సినీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking