👉ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి నియోజకవర్గ ప్రతినిధి జులై 13(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా:సంగారెడ్డి/ఉపాధ్యాయ వృత్తి సమాజానికి ఆదర్శం అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు,పీచేర్యాగడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పట్లోళ్ల సురేష్ ఉద్యోగ విరమణ అభినందన సభను సంగారెడ్డిలో ఓ ఫంక్షన్ హాల్ నిర్వహించారు,తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకు ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు,ఉద్యోగ విరమణ సందర్భంగా పట్లోళ్ల సురేష్ ను శాలువాతో సన్మానించారు,ఎమ్మెల్యే వెంట మాజీ సిడిసి చైర్మన్ లు కాసాల బుచ్చిరెడ్డి విజేందర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ రామప్ప తదితరులు పాల్గొన్నారు.