శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి

సికింద్రాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: లష్కర్‌ బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ముఖ్యమంత్రి అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత అమ్మ వారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.

   

ఈ ప్రత్యేక పూజల సందర్భంగా మంత్రులు కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్‌ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ , సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి , హర్కర వేణుగోపాల్‌ రావు రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ , శాసనసభ్యులు దానం నాగేందర్‌ , శ్రీగణేశ్‌ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు దక్కన్‌ మానవ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking