ప్రవాహం పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో వర్షాలువరదలు సహాయక చర్యలుకడెం ప్రాజెక్టుకు వస్తున్న వరద, నీటి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. కడెం ప్రాజెక్టుకు భారీ వరదనీటి ప్రవాహం పోటెత్తింది .
ప్రాజెక్టు స్థాయికి మించి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది.
ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటిని ప్రస్తుతం 14 గేట్లు తెరిచి ఎప్పటికప్పుడు వరద నీటిని కిందికి వదులుతున్నాం.
లక్షల క్యూసెక్కులు వరదనీటి ప్రవాహం రావడంతో కడెం ప్రాజెక్టు వరద గేట్ల పైనుంచి నీటి ప్రవాహం కొనసాగింది.
కడెం ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని స్వయంగా ప్రాజెక్టు వద్దకు వెళ్లి పరిశీలించాం.
నాతోపాటు స్థానిక ఎమ్మెల్యే రేఖ శాం నాయక్, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ,ఎస్పీ ప్రవీణ్ కుమార్ ,ఇరిగేషన్ అధికారులతో డ్యామ్ వద్దకు వెళ్లి వరద పరిస్థితిని అంచనా వేయడం జరిగింది.
ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొద్దిగా తగ్గినప్పటికీ ఎగువ భాగంలో భారీ మొత్తంలో వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నందున అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది..
ప్రాజెక్టు కింద భాగంలో ఉన్న 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.
వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలలో భోజన వసతి ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం.
కడెం ప్రాజెక్టుపై ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలు వరదలపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దు.
ఇలాంటి వదంతులు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సమాజానికి అంత మంచిది కాదు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేయడానికి జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అప్రమత్తమయ్యారు.
భారీ వర్షాల నేపథ్యంలో
ప్రజలు ఎవ్వరు కూడా అవసరమైతే తప్పితే బయటకు రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి.
కడెం ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగు వరద గేట్ల మరమ్మత్తుల కోసం నిపుణుల కమిటీ చర్యలు చేపట్టింది

Leave A Reply

Your email address will not be published.

Breaking