బీజేపీ వంద అబద్దాలు’’ బుక్‌ లెట్‌, సీడీ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ విూడియా విభాగం రూపొందించిన ‘‘బీజేపీ వంద అబద్దాలు’’ బుక్‌ లెట్‌, సీడీనీ గౌరవ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రగతిభవన్‌ లో ఆవిష్కరించారు.
బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ విూడియా విభాగం నాలుగు నెలలుగా బీజేపీ వైఫల్యాలను బట్టబయలు చేస్తూ వస్తోంది. బీఆర్‌ఎస్‌ సోషల్‌ విూడియా కన్వీనర్లుగా ఉన్న మన్నె క్రిషాంక్‌, వై.సతీష్‌ రెడ్డి , జగన్‌ మోహస్‌ రావు , దినేష్‌ చౌదరి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ ప్రజలకు ఇచ్చిన హావిూలు నెరవేర్చకుండా మోడీ సర్కారు ఎలా మోసం చేసింది..? తెలంగాణ ప్రజలకు హక్కుగా రావాల్సిన వాటిని ఎలా అడ్డుకుంటున్నారనే విషయాలను ఇందులో వివరించారు. బీజేపీ తప్పులను ప్రతీరోజు బయటపెడుతున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారంగా మారిన జీఎస్టీ, ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ సదుపాయం, అందరికీ ఇల్లు, విభజన హావిూల అమలు, బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌, ఐటీఐఆర్‌, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు.. బీజేపీ నాయకుల అసలు రూపాన్ని ఈ క్యాంపెయిన్‌ లో బయటపెట్టడం జరిగింది.
సోషల్‌ విూడియా కన్వీనర్లు చేపట్టిన ‘‘బీజేపీ వంద అబద్దాలు’’ క్యాంపెయిన్‌ ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. అబద్దాల పునాదుల విూద రాజకీయం చేస్తున్న బీజేపీ అసలు రూపాన్ని ప్రజల ముందు ఉంచారన్నారు. బుక్‌ లెట్‌, సీడీ ద్వారా బీజేపీ తప్పులను, వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను గ్రావిూణ ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసేలా చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్‌ గౌడ్‌, ఎంపీ బీబీ పాటిల్‌ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking