వెయ్యి కోట్లతో పద్మశాలి డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలి..

మంత్రి కెటిఆర్ కు చేనేత కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుజ్జ సత్యం వినతి

హైదీరాబాద్ ఆగష్టు 14 ();పద్మశాలిల అభివృద్ధికి వెయ్యి కోట్లతో పద్మ డెవల ప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, తెలంగాణ చేనేత కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుజ్జ సత్యం చేనేత, జౌళి శాఖ, శాఖమున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి కెటిఆర్ కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. నేడిక్కడ మీడియా సమావేశం లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినపుడు 400 పైచిలుకు చేనేత సహకార సంఘాలు ఉండగా నేడు కేవలం 160 నుండి 170 సంఘాలు మాత్రమే వృత్తి కొనసాగిస్తూ అంపశయ్యపై విలవిల లాడుతున్నాయన్నారు. సహ కార సంఘాల ఎన్నికలు జరిపించి ఆ వ్యవస్థని పునరుత్తేజం చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పద్మశాలి సమాజ అభ్యున్నతి కోసం, అన్ని రంగాల్లో ఎదుగుటకు 200 కోట్ల రూపా యల గ్రాంటును నైపుణ్యం, శిక్షణ కొరకు కేటాయించాలని కోరారు. జీవనోపాధి కోసం షరతులు లేని ఋణాలు, ఆర్థిక సాయం అందజేయాలని అన్నారు. ప్రభుత్వ ప్రయివేటు రంగాలలో ఉద్యోగ సాధనకై నైపుణ్యాల శిక్షణ అందజేయాలన్నారు. రాజకీయ నైపుణ్యాల శిక్షణ, భారత రాజ్యాంగం పట్ల సాధికారికత, లీడర్ షిప్, వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇప్పించాలని వినతి పత్రంలో మంత్రిని కోరినట్లు గుజ్జ సత్యం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking