మంత్రి మహేందర్ రెడ్డి
తెలంగాణా పథకాలను కాపీ కొడుతున్నారు
దేశం తెలంగాణా వైపు చూస్తుంటే… ప్రతిపక్షాలు విమ్శిస్తున్నాయి : మంత్రి మహేందర్ రెడ్డి
“చేవెళ్ల నియోజకవర్గం లో 21 కోట్ల 49 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి*
అక్టోబర్ 8 :
ప్రజలు
కాంగ్రెస్, బిజెపి పథకాలను నమ్మొద్దని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
చేవెళ్ల నియోజకవర్గం లోని మొయినాబాద్, చేవెళ్ల,నవాబు పేట, రూ. 21 కోట్ల 49 లక్షల అభివృద్ధి పనులకు ఆయన
ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా రెడ్డి తదితులతో కలసి శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. సురంగాల్ లో శివాజీ విగ్రహావిష్కరణ చేశారు.
ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణా పథకాలను దేశంలోని కాంగ్రెస్, బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో
కాపీ కొడుతున్నారన్నారు.
దేశం తెలంగాణా వైపు చూస్తుంటే… ప్రతిపక్షాలు విమ్శిస్తున్నాయని మంత్రి మహేందర్ రెడ్డి విమర్శించారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు.
ఎన్నికల అప్పుడే గ్రామాల్లో తిరుగుతూ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, బిజెపి నేతలను ప్రజలు నమ్మరని అన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో వేలకోట్లతో అభివృద్ధి సాగుతుందని, సంక్షేమ పథకాలు సైతం అలానే అమలవుతున్నాయని వెల్లడించారు. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఉందని రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు ఎక్కడున్నాయని మహేందర్రెడ్డి ప్రశ్నించారు.
ఎవరు ఎంత ప్రయత్నించినా ప్రజలు సీఎం కేసీఆర్ ను మరో మారు దీవిస్తారని, ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని మహేందర్రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యేగా యాదయ్యను, ఎంపీగా రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మహేందర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాగుతుందని చెప్పారు. వ్యక్తిగత పథకాలు పేదరిక నిర్మూలనకు తోడ్పడుతాయని చెప్పారు.
ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాగుతుందని అందుకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రజలు మరో మారు తనను దీవించాలని కోరారు.
జెడ్పిటిసిలు శ్రీకాంత్, మలతి కృష్ణారెడ్డి, జయమ్మ,
ఎంపీపీలు నక్షత్రం, విజయలక్ష్మి రమణారెడ్డి, భవాని తదితరులు పాల్గొన్నారు.