వరంగల్ హన్మకొండ ప్రజాబలం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టత్మకంగా తీసుకున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం రోజున గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ప్రారంభించారు.
అనంతరం కుడా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి శ్రీమతి కొండ సురేఖ తో పాటు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ దాన కిషోర్, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య సత్య శారదాదేవి, నగర కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే గార్లతో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post