ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 6:
తెలంగాణ నాదాన్ని వినిపించిన పోరాటశీలి, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ సిద్ధాంత కర్త, తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 90వ జయంతిని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ రాధికా గుప్త, రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి గార్లు మరియు సిబ్బంది సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆచార్య జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రము కోసం పలు పుస్తకాలు రచించారని, అధ్యాపకుడిగా వారు చేసిన సేవలను, మార్గ నిర్దేశకత్వాన్ని కొనియాడుతూ ప్రతి ఒక్కరు వారిని ఆదర్శంగా తీసుకుని తమ యొక్క వృత్తి పట్ల చిత్త్త శుద్ధితో, నిబద్ధతతో వ్యవహరించాలని తెలియచేసినారు.
వారు కలలు కన్నా తెలంగాణ ను అభివృద్ధి పధంలోకి తీసుకెళ్లడానికి మన వంతు కృషి చెయ్యాలని ఈ సందర్బంగా తెలిపినారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ విజయేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రాధికా గుప్తా IAS , డి ఆర్ ఓ జె.ఎల్.బి.హరిప్రియ మరియు జిల్లా అధికారులు వారి సిబ్బంది.