సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలోపాల్గొనని మంత్రి

 

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 2( ప్రజాబలం) రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు, ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉగాది నుంచి ఈ పతాకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు,, అందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా, వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొని ఈ సన్న బియ్యం పతాకాన్ని ప్రారంభించారు, మన ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనర్సింహ మాత్రం ఈ కార్యక్రమంలో జిల్లాలో ఎక్కడ పాల్గొనలేదు, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలో ఉన్న మంత్రి మాత్రం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది, మంత్రి మంగళవారం జిల్లా కేంద్రంలో ఉన్నప్పటికీ, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఎక్కడ పాల్గొనలేకపోయారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking